Monday, April 29, 2024

యువకుడిపై హత్యాయత్నం – అప‌స్మార‌కంలో క్ష‌త‌గాత్రుడు

కొత్తూరు, జులై 21(ప్రభ న్యూస్): యువకుడి పై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన కొత్తూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్ నర్వ గ్రామానికి చెందిన మహమ్మద్ హజీ(36) ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తన స్నేహితుల బర్తడే ఉందంటూ భార్య తబసుమ్ బేగం కు చెప్పి పదిన్నర గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయటకు వెళ్ళాడు. ఈ క్రమంలో ఒక గంట తర్వాత మహమ్మద్ హజి తన ఇంటికి సమీపంలో రక్తపు మడుగులో పడి ఉండటంతో గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేశారు.

తీవ్ర రక్త గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఎండి. హజిని హుటాహుటిన చికిత్స నిమిత్తం 108 వాహనంలో ప్రైవేటు దావకానకు తరలించారు. విచక్షణ రహితంగా కడుపులో, తలపై కొట్టి పారిపోయిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. హత్యాయత్నానికి ఏదైనా అక్రమ సంబంధం లేక ఏదైనా పాత కక్షలా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఎండి.హజీకి భార్య తబసుమ్ బేగం , ఐదు మంది కుమార్తెలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement