Monday, December 9, 2024

Suryapet: పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో దాడి.. ఒకరికి తీవ్రగాయాలు

సూర్యాపేట, ప్రభ న్యూస్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో పట్టపగలు యువకులు బీభత్సం సృష్టించారు. ఒక వ్యక్తిపై కత్తితో ముగ్గురు యువకులు దాడిచేశారు. కత్తిపోట్లతో గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లకు పాల్పడ్డ యువకులను స్థానికులు పట్టుకొనే ప్రయత్నం చేయగా… వారిని వారిస్తూ అక్కడి నుండి పారిపోయారు. సంఘటనా స్థలంలో దుండగులు వాహనం, కత్తి వదిలివెళ్ళారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement