Tuesday, October 15, 2024

Helping Hand – ఆపదలో ఉన్న గుండెకు అండగా మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజాంబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గ మండల కేంద్రానికి చెందిన గుండె సంబంధిత వ్యాధితో బాద‌ప‌డుతున్న పేద కుటుంబానికి మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి అండ‌గా నిలిచారు.. చికిత్స కు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని సిఎం స‌హాయ నిధిని ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడారు.. వివ‌రాల‌లోకి వెళితే బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బండి పెద్ద మల్లయ్య యాదవ్ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈవిషయం స్థానిక నాయకులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ కొరకు 3 లక్షల రూపాయల LOC మంజూరు చేయించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో గురువారం 3 లక్షల రూ. ఎల్ఓసి కాపీని బాధిత సోదరుడు బండి నడ్పి మల్లయ్యకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

నిరుపేదలమైన త‌మ‌కు గుండె ఆపరేషన్ కొరకు మూడు లక్షల LOC మంత్రి మంజూరు చేశారని,ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని,జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..ఈ కార్య‌క్ర‌మంలో బాల్కొండ సర్పంచి భూస సునీత-నరహరి,బిఆర్ఎస్ పార్టీ బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement