Monday, April 29, 2024

Attack – మామా అల్లుళ్లపై గొడ్డలి తో దాడి -! మామ మృతి

నిర్మల్ రూరల్ జనవరి 12 ప్రభు న్యూస్ )నిర్మల్ పట్టణంలో ఇద్దరు వ్యక్తులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

స్థానికుల వివరాల ప్రకారం.. బంగల్పేట్ జంగల్ హనుమాన్ వద్ద అనంతపేట్ గ్రామానికి చెందిన పోలీసు బుచ్చన్న మామా అల్లుళ్లు బైకుపై వెళ్తుండగా దుండగులు వారిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బుచ్చన్న (55) అక్కడికక్కడే మృతి చెందగా.. అల్లుడి వెంకటేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా, దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలాన్ని నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి పరిశీలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement