Monday, April 29, 2024

Atchampet – త్రాగునీటి సమస్య లేకుండా చూసుకోండి …ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, ఫిబ్రవరి,6(ప్రభన్యూస్): అచ్చంపేట నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మంగళవారం అంబేద్కర్ ప్రజా భవన్ క్యాంప్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు , మండల అధికారులు అచంపేట్ డివిజన్ అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా చూడాలి అని పిలుపునిచ్చారు..

వచ్చేది వేసవికాలం కావడంతో దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు మరియు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులపైనే ఉందని గుర్తు చేశారు. ప్రత్యేక అధికారాలు గ్రామాలకు గ్రామపంచాయతీలో వెళ్లకుండా నిర్లక్ష్యంగా వహిస్తే వారిపైన శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కారం చూడాల్సిన బాధ్యత మండల అధికారులు డివిజన్ అధికారులు వివిధ మండలానికి చెందినటువంటి ముఖ్య అధికారుల అందరి పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా పాలనలో భాగస్వాములై ప్రజలకు చేరువై పాలన అందించాలని పేర్కొన్నారు.

బీహార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే

బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీశైలం దేవస్థానం సందర్శనకు వెళుతున్న సందర్భంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని .అమ్రాబాద్ మండలం మన్ననూర్ వనమాలిక గెస్ట్ హౌస్ లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement