Sunday, April 14, 2024

TS: తెలంగాణ స‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పండి… రేవంత్ రెడ్డి డిమాండ్

మాజీ మంత్రి హారీష్ ఆరోప‌ణ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి కౌంట‌ర్ ఇస్తూ… గత ప్రభుత్వ తప్పులు ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇంకా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తప్పులు ఒప్పుకొని సరిచేసేందుకు సలహాలు ఇస్తే.. ఇప్పుడైనా సమాజం అభినందించేది అని గుర్తుచేశారు.

ఎదురు దాడే … సిగ్గు చేటు…
ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తప్పుల తడక అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది తామే.. తెచ్చిందీ మేమే అని రేవంత్ తేల్చి చెప్పారు. పార్లమెంట్‌లో స్ప్రే బారిన పడింది తమ ఎంపీలే అని గుర్తుచేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టలన్నది కేసీఆర్ ఆలోచనే అని తెలిపారు. మేడిగడ్డ పాపాలకు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరే కారణమని చెప్పారు.

ఇదే ప్రాజెక్టును తుమ్మిడిహట్టి దగ్గరే కడితే మంచిదని ఇంజినీర్లు సిఫార్లు చేశారన్నారు. 151 మీటర్లతో ప్రాజెక్ట్ నిర్మించాలని పదే పదే చెప్పార‌న్నారు.. మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేస్తే 150 మీటర్లు అయినా మంచిదే నిర్మించార‌ని, అయితే తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ నిరుపయోగమ‌ని ఇంజినీర్లు తేల్చారని గుర్తుచేశారు. ఐదుగురు ఇంజినీర్ల బృందం స్పష్టంగా చెప్పిన విషయం ఇది అని తెలిపారు. వాస్త‌వాలు బీఆర్ఎస్ నేత‌లు గ్ర‌హించాల‌ని రేవంత్ కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement