Friday, May 17, 2024

మరో మూడ్రోజులు భారీ వర్షాలు.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు : వాతావరణ శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరి ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 9మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో శక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.

కూకట్‌పల్లి, మేడ్చల్‌, సూరారం, మాదాపూర్‌, గచ్చిబౌలి, చింతల్‌, బాలానగర్‌, కేపీహెచ్‌పీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట్‌, బాచుపల్లి, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారులపై వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి చిరు వ్యాపారులు, ప్రయాణికులు ఇక్కట్లకు లోనయ్యారు. రహదారులపై నిలిచిన నీటితో వాహన చోదకులు, పాదచారులకు ఇబ్బందులు తప్పలేదు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement