Sunday, May 19, 2024

ముసురు దుప్పట్లో భాగ్యనగరం – మరో నాలుగు రోజులూ భారీ వర్షాలు

హైదరాబాద్. – ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో రెండు రోజుల నుంచి ముసురు కమ్ముకుంది.ముఖ్యంగా హైదరాబాద్ మహానగరమైతె రెండు రోజులుగా ముసురు కమ్మేసింది. రోజంతా నాన్‌స్టాప్‌గా జల్లులు పడుతూనే ఉన్నాయ్‌!. గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు తీవ్ర చలిగాలుల వీస్తుండటంతో నగర వాసులు బయటకు రావడానికే జంకుతున్నారు. దాంతో, హైదరాబాద్‌లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు మంత్రి కేటీఆర్‌. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉంటే ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, పెద్దపల్లి భూపాలపల్లి లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే ప్రజలను కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement