Sunday, April 28, 2024

TS : రాష్ట్రానికి అమిత్ షా రాక‌…బీజేపీ నేతలతో స‌మావేశం…

ఇవాళ తెలంగాణ‌లో కేంద్ర‌మంత్రి అమిత్‌షా ప‌ర్య‌టించ‌నున్నారు. ఢిల్లీ నుంచి ఆయ‌న ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నాం ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు.

- Advertisement -

అనంతరం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నందున ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఇతర నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రాష్ట్ర నేతలతో షా భేటీ కానున్నారు. సదస్సు అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో సాయంత్రం వరకు పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement