Wednesday, May 15, 2024

Alert – అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి.- వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్ జూలై 27 (ప్రభ న్యూస్): జిల్లాలో కురుస్తున్నా భారీ వర్షాల సందర్బంగా జిల్లా లోని పోలీస్ అధికారులు అప్రమతంగా ఉండి విధులు నిర్వహిస్తూ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలను కూడా అప్రమతం చెయాలనీ ఎస్పీ సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి గురువారం రోజు పోలీస్ అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. సెట్ కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్నా వర్షాల కారణంగా జిల్లాలో వాగులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి కావున పోలీస్ అధికారులు ఇతర శాఖ అధికారులతో కో ఆర్డినేషన్ చేసుకుంటూ తమ పరిధిలలోని వాగులకు, ప్రాజెక్టు ల ప్రవాహం పైన అవగాహనా కల్పించాలని కోరారు.

ప్రమాదకరమైన వాగులకు దగ్గర పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలసి రోడ్డు బ్లాక్ చేసి బందోబస్త్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. , దయచేసి ప్రజలు ఎవ్వరు కూడా ప్రమాదకరమైన వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు అని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని సూచించారు. , పాత ఇండ్లు, పాత నిర్మాణాలు, కట్టడాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని,ఏమైనా అత్యవసరం ఉన్నట్లు అయితే డైల్ 100 కి కాల్ చేయాలనీ జిల్లా ఎస్పీ కోరారు. వర్షాల సందర్బంగా ప్రజల నుండి పోలీస్ అధికారులకు వచ్చే పిర్యాదులపైన వేంటనే స్పందించి, ప్రజలకు అని వేళల అందుబాటులో ఉండాలని ఎస్పీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement