Wednesday, May 15, 2024

Air Show – 18 నుంచి ‘వింగ్స్ ఇండియా’… ముస్తాబవుతున్నబేగంపేట ..

హైదరాబాద్‌: విమానయాన రంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘వింగ్స్ ఇండియా కార్యక్రమానికి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం ముస్తాబవుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 21 వరకు వింగ్స్ ఇండియా ప్రదర్శన జరగనుంది. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన అధునాతన విమానాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు.. ఈ రంగానికి ఉన్న అవకాశాలపై వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement