Monday, May 6, 2024

హ్యాండ్‌బాల్‌ జిల్లా జట్టుకు క్రీడా దుస్తుల అందజేత..

మంచిర్యాల : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఈ నెల 25వ తేది నుండి జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం క్రీడా దుస్తులను అందజేసింది. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా జట్టు సభ్యులకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో క్రీడా దుస్తులను హ్యాండ్‌బాల్‌ సంఘం రాష్ట్ర కోశాధికారి కనపర్తి రమేష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలుగువెల్లి రమేష్‌ రెడ్డిలు అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ వారికి వీడ్కోలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement