Friday, October 11, 2024

ADB: అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పీ

బోథ్, అక్టోబర్ 13, (ప్రభ న్యూస్) : ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో గల అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ అయిన ఘన్ పూర్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు.

అన్ని రకాల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేక పోలీసు నిఘాను ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఎస్పీ వెంట బోథ్ సీఐ భీమేష్, ఎస్సై రాము ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement