Monday, April 29, 2024

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

బెల్లంపల్లి : సెకండ్‌ వేవ్‌ రూపంలో కరోనా మళ్లీ విజృంభిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి పోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై సమ్మయ్య సూచనలు చేశారు. ప్రతీఒక్కరు కరోనాను అరికట్టి ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్న తరుణంలో మళ్లీ సెకండ్‌ వేవ్‌ రూపంలో కరోనా వేగంగా విజృంభిస్తుందని అన్నారు. ప్రతీఒక్కరు మాస్కు దరించాలని, ఎవరు కూడా అనవసరంగా బయట తిరగవద్దని, తరచూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, బయట నుండి ఇంట్లోకి వెళ్లేటప్పుడు ఏది ముట్టుకోకుండా చేతులను శుభ్రం చేసుకోవాలని, వ్యాక్సిన్‌ వేసుకున్నాం కదా అని విచ్చలవిడిగా తిరగవద్దని, అదేవిదంగా మాస్కులు దరించని వారిపై జీవో నెంబర్‌ 68 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ఫైన్లు కట్టే విధంగా ఫైన్లు విధిస్తామని అన్నారు. ఆయన వెంట బ్లూకోల్ట్‌ సిబ్బంది విశ్వేశ్వర్‌, కానిస్టేబుల్‌ మురళీ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement