Sunday, April 28, 2024

ADB: విధుల్లో నిర్లక్ష్యం ….ఆరుగురు అటవీ అధికారుల‌పై వేటు…

జన్నారం, ఫిబ్రవరి6( ప్రభ న్యూస్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు అటవీ అధికారులు స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ ,నిర్మల్ జిల్లాలలోని ఆరుగురు అటవీ శాఖ సెక్షన్, బీట్ ఆఫీసర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

కవ్వాల పులుల అభయారణ్యంలోని మంచిర్యాల జిల్లాలోని జన్నారం డివిజన్లోని ఇంధన్ పెళ్లి రేంజి కవ్వాల ఫారెస్ట్ సెక్షన్, బిట్ ఆఫీసర్లు అఫ్జల్ ఖాన్, శ్రీధర్ లను , కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఇస్లాంపూర్ వేస్ట్, కొత్తపల్లి అటవీ శాఖ సెక్షన్ ,బిట్ ఆఫీసర్లు వినయ్ కుమార్, ఇమ్రాన్ లను ఖాలేశ్వరం జోన్ సి.ఎఫ్ శాంతారామ్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

బాసర జోన్ లోని నిర్మల్ జిల్లా ఉడుoపూర్ రేంజ్ పరిధిలోని ఇస్లాం పూర్ ఈస్ట్ ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు రవికుమార్, భుమేష్ లను ఆ జోన్ సి. ఎఫ్ శరవణన్, నిర్మల్ డిఎఫ్ఓ రామకృష్ణ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల ద్యార మంగళవారం ఆరుగురు సెక్షన్, బీట్ ఆఫీసర్లకు సస్పెన్షన్ ఆదేశాలు అందాయి. గత ఐదు రోజుల క్రితం కొమరం భీమ్ అసిఫా జిల్లాలోని జోడెగాట్ రేంజ్ లోని కొత్తపల్లి గ్రామంలో రూ. 4 లక్షల అక్రమ టేకు కలపను సెక్షన్ ఆఫీసర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ వినయ్ కుమార్ సాహు ఆయా ఆటవీశాఖ బీట్, సెక్షన్లలో తనిఖీలు నిర్వహించగా, ఆయా అటవీ శాఖ బీట్లలో టేకు చెట్ల నరికివేత జరిగిందని, ఈ వ్యవహారంలో సంబంధిత ఫారెస్ట్ అధికార్ల నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement