Sunday, April 28, 2024

కార్మికుల అభిమానం పొందిన మేనేజర్..

కాసిపేట : కార్మికుల ప్రేమాభిమానాలు పొంది మంచి అధికారిగా పేరు సంపాదించుకున్న మేనేజర్‌ భూ శంకరయ్య అని కాసిపేట గనుల గ్రూప్‌ ఏజెంట్‌ రాజేందర్‌ కొనియాడారు. మందమర్రి ఏరియా కాసిపేట గని నుండి ఏరియాలోని మరో గనికి బదిలీపై వెలుతున్న సంధర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఏజెంట్‌ మాట్లాడారు. గనిలో మూడు సంవత్సరాలుగా మేనేజర్‌గా విధులు నిర్వహించిన శంకరయ్య నాయకులు, కార్మికులు, గని అధికారుల మెప్పు పొందారని పేర్కొన్నారు. సమస్యలపట్ల సానుకూలంగా స్పదింస్తూ ఏరియాలోనే గనికి గుర్తింపు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఇదే వేదికపై గనిలో డివై మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న అల్లావుద్దిన్‌ గనికి మేనేజర్‌ గా ప్రమోషన్‌ పొంది, బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో వారిరువురిని గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, పలు క్యాటగిరిలకు చెందిన కార్మికులు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందచేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్‌ అల్లావుద్దిన్‌, రక్షణాధికారి సునీల్‌, సంక్షేమాధికారి మైత్రేయభందు, ఇంజనీర్‌ శేఖర్‌, గుర్తింపు సంఘం నాయకులు దుగుట శ్రీనివాస్‌, అశోక్‌, శ్రీనివాస్‌, ప్రాతినిద్య సంఘం నాయకులు చిప్ప నర్సయ్య, బియ్యాల వెంకటస్వామి, దాగం మల్లేష్‌, నాయకులు, గని అధికారులు, సూపర్‌ వైజర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement