Saturday, April 10, 2021

రెండు లారీలు ఢీ..క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌.. క్లీనర్‌..

తాండూరు : తాండూరు మండలం ఐబీ కేంద్రంలో మధ్యాహ్నం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. నిజామాబాద్‌ నుండి చంద్రాపూర్‌ వైపు వెళ్తున్న పసుపులోడ్‌తో వెళ్తున్న లారీ చంద్రాపూర్‌ నుండి బెల్లంపల్లి వైపు వస్తున్న లారీ ఐబి కేంద్రంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాధంలో డ్రైవర్లు క్యాబిన్‌లో ఇరుక్కున్నారు. ప్రమాధం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి తాండూరు సీఐ కోట బాబురావు, ఎస్సై శేఖర్‌ రెడ్డిలు అక్కడికి చేరుకొని జేసీబీ ద్వారా క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌, క్లీనర్లను రక్షించారు. తీవ్రంగా గాయాల పాలైన లారీ డ్రైవర్‌ను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను రక్షించేందుకు సహకరించిన స్థానికులకు సీఐ బాబురావు, ఎస్సై శేఖర్‌రెడ్డిలు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News