Sunday, April 28, 2024

TS : భార్గవ్ దేశ్ పాండే పై సస్పెన్షన్ ఎత్తివేత…

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్): లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి దూరంగా ఉంటున్న నేతలందరిని సొంతగూటికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా డిసిసి అధ్యక్షునిగా, ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి క్రమశిక్షణ వేటు కింద సస్పెన్షన్ గురైన ఆదిలాబాద్ కు చెందిన భార్గవ్ దేశ్ పాండే కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు లైన్ క్లియర్ అయింది.

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియదన్షి దీపా దాస్ మున్షి ఆదేశాల మేరకు గురువారం భార్గవదేశ్ పాండే పై విధించిన సస్పెన్షన్ వేటు రద్దు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి. చిన్నారెడ్డి సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే రోజు భార్గవ దేశ్ పాండే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. కాగా పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఐదేళ్లపాటు సస్పెన్షన్ కు గురైన మాజీ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి లపై కూడా సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలో చేర్చుకునేందుకు సీనియర్లు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement