Saturday, October 12, 2024

ADB: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాదిద్దాం.. గండ్రత్ ఈశ్వర్

నిర్మల్ రూరల్, సెప్టెంబర్ 21 (ప్రభ న్యూస్) : తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రధాత, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాదిద్ధామని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. ఆయన 11వ వర్ధంతి సందర్భంగా గండ్రత్ ఈశ్వర్ పద్మశాలి సంఘ సభ్యులతో కలిసి గురువారం పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి
పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.


ఈ సందర్భంగా గండ్రత్ ఈశ్వర్ మాట్లాడుతూ… 1945 లో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి అని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఆన్యాయాన్ని గుర్తించి ప్రజలను చైతన్యం చేసి, గొంతుని వినిపించారన్నారు. మూడు దశల ఉద్యమాలకు ఊపిరిలూది, విశాలాంధ్రను తీవ్రంగా వ్యతిరేకించి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, నిజాం నవాబు నిరంకుశ పాలనపై అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. బాపూజీ ఆశయాలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషి, సహకారంతో స్వాతంత్ర్య సమర యోధుల, తెలంగాణ ఉద్యమ కారుల, పలువురు ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పుకోవటం జరిగిందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలుక రమణ, కౌన్సిలర్ /యువజన సంఘం అధ్యక్షులు బిట్లింగ్ నవీన్, ప్రధాన కార్యదర్శి అల్లం అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఐట్ల నర్సయ్య, అడెపు భూమన్న, కుర్ర నరేష్, మెరుగు పవన్, భాను చందర్, నరహరి, కిషన్ టి.గురు, సబ్బని శ్రీనివాస్, వేముల కిషన్, ఏనుగందుల రావికుమార్, పద్మశాలి సంఘ సభ్యులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement