Wednesday, May 1, 2024

ఆదిలాబాద్ జిల్లాలో ఇంజెక్షన్ దాడి..

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఇంజెక్షన్ దాడి కలకలం చోటుచేసుకుంది. బస్టాండ్ లో నిల్చున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి గుర్తు తెలియని దుండగులు ఇంజక్షన్ పొడిచారు. బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఇంజక్షన్ పొడిచి పరారైనట్లు బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు తెలిపారు.

ఇంజక్షన్ ప్రభావంతో సదరు యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.రోడ్డుపై పడిపోయిన శ్రీకాంత్ ను స్థానికులు హుటాహుటిన రిమ్స్ కు తరలించారు. అయితే బాధితుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అయితే గత నెలలో ఖమ్మం జిల్లాలో కూడా జమాల్‌ అనే వ్యక్తిపై ఇంజెక్షన్‌తో దాడి జరిగిన విషయం విధితమే. రోడ్డు పక్కన వ్యక్తి పడిఉండటంతో వాహనదారులు సమీప ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే జమాల్ మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement