Friday, April 19, 2024

విధేయుడు… అందరివాడు!

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే సాధించిన విజయం ఊహించిందే. పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీకి అత్యంత విధేయుడు, అయినా అందరివాడుగా పేరొందారు. ఏభై ఏళ్ళుగా పార్టీకి అత్యంత విశ్వాస పాత్రంగా సేవలం దిస్తున్న ఖర్గే ఈ అత్యున్నత పదవి లభించడం పరమపద సోపానమే. కాంగ్రెస్‌ సిద్ధాంతాల పట్ల ఆకర్షి తులై యువకునిగా ఉన్నప్పుడే పార్టీలో చేరి ఆ పార్టీలో కార్మిక నాయకునిగా ఖర్గేఎదిగారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక 22 ఏళ్ళ తర్వాత జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ137 ఏళ్ళ చరిత్రలో గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన వారే 50 ఏళ్ళుపైగా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇది జాతీయ పార్టీ అయినప్పటికీ కుటుంబ పార్టీగా ప్రతిపక్షాలు తరచు ఆరోపిస్తుంటాయి. అయితే, అది సరికాదని రుజువు చేసేందుకే సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ఈ ఎన్నిక తతంగం నడిపించారన్న వచ్చిన కథనాల్లో అసత్యం లేకపోవచ్చు. ఖర్గే మాత్రమే కాదు, ఆయనకు వ్యతిరే కంగా పోటీ చేసిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ కూడా సోనియా అభిమానియే. అంతేకాకుండా కాంగ్రె స్‌లో అందరికీ అవకాశాలున్నాయని ఆయన మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు.

అయితే, ఖర్గేయే సోనియా అధికార అభ్యర్థి అంటూ జరిగిన ప్రచారం ఆయనకు కలిసొచ్చింది. కాంగ్రెస్‌ అధిష్టానం అభీష్టం మేరకే ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక కాంగ్రెస్‌ ఆంతరంగిక వ్యవహారమైనప్పటికీ, దేశమంతా దీనిపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో లేదు. రాష్ట్రాల్లో కూడా కేవలం రెండు మూడు తప్ప ఎక్కడా లేదు. అందువల్ల జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థితిలో ఆ పార్టీ లేదు. అయినప్పటికీ, జాతీయ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ తన వంతు పాత్ర వహిస్తూనే ఉంది. కేంద్రంలో అధికారంలో తొలి ఎన్‌డీఏ ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాని అనుసరించి అన్ని విష యాల్లో సంప్రదిస్తూ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్‌ సీట్లు బాగా తగ్గి పోవడం, ప్రతిపక్ష హోదా కూడా పొందలేని స్థితిలో ఉండటం వల్లనేమో ఆ పార్టీకి ప్రస్తుత ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అయితే, కాంగ్రెస్‌ మాత్రం ప్రజా సమ స్య లపై పోరాటాలు నిర్వహిస్తూ, కేం ద్రానికి ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలియ జేస్తూనే ఉంది.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని బయటి వ్యక్తులు నిర్వహిం చడం తాజా స్మృతిపథం నుంచి చూస్తే చాలా తక్కువే. రాజీవ్‌గాంధీ హత్యానంతరం సీతారామ్‌ కేసరి అనే వయోవృద్ధుడు పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహించింది కొంత కాలమే అయినా, పొట్టివాడైనా గట్టివాడన్న రీతిలో అందరినీ గడగడలాడించాడు. గాంధీ – నెహ్రూ కుటుంబానికి జీ-హుజూర్‌ అనకుండా స్వతంత్రంగానే వ్యవహరించారు. అయితే, ఆ స్వతంత్ర వైఖరే ఆయన పదవికి ఎసరు తెచ్చింది. కాంగ్రెస్‌లో మరెవరు ఆ పదవిని చేపట్టినా ఆయనకు ఎదురైన అనుభవం తప్ప దన్న భావన బలపడిపోయింది. అందుకే, అధ్యక్ష పదవి కి ఎన్నిక నిర్వహించాలన్న డిమాండ్‌ రాలేదు.అయితే, 2019 ఎన్నికల తర్వాత పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ రాజీనామా చేయడమే కాకుండా, ఆయన నాయకత్వం పట్ల పార్టీలో సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పార్టీ అధ్యక్ష పదవికి బయటవారికి అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ తెర మీదికి వచ్చింది. అదే సందర్భంలో రాహుల్‌యే పార్టీ నాయకత్వాన్ని చేపట్టాలన్న కోరస్‌ అయితే, ఊపం దుకుంది. రాహుల్‌ ఇందుకు ససేమిరా అంగీక రించకపో వడంతో ఎన్నిక జరపాల్సి వచ్చింది.

- Advertisement -

రాహుల్‌ ధోరణి నచ్చక పార్టీ సీనియర్‌ నాయకులైన కపిల్‌ సిబాల్‌, గులా మ్‌ నబీ ఆజాద్‌లు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపో యారు. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీం దర్‌ సింగ్‌ కూడా అదే మాదిరిగా పార్టీ నుంచి వైదొలగి కొంత కాలం ఆగిన తర్వాత బీజేపీలో చేరారు. అసోం ప్రస్తుత ముఖ్యమంత్రి బిశ్వ శర్మ కూడా రాహు ల్‌తో విభేదించి బీజేపీలోకి వెళ్ళిన వారే. రాహుల్‌ ఎక్కువ కాలం విదేశాల్లో గడుపుతుంటారనీ, పార్ట్‌టైమ్‌ రాజకీ యవేత్త అని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కాంగ్రె స్‌ అధ్యక్ష పదవిని ఆయనే చేపట్టాలన్న డిమాండ్‌ తగ్గ లేద ు. ఇలా ఐదారు సంవత్సరాలు గడిచింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికల్లో కాంగ్రెస్‌ వరుస ఓటములను చవి చూడటంతో ఈ విమర్శలు మరింత ఎక్కువ య్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిపించాలని రాహుల్‌యే పట్టుపట్టారు. ఆయన అభీ ష్టం ప్రకారమే ఇప్పుడు గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెం దని వారు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement