Thursday, May 2, 2024

Basara: గొప్ప గొప్ప కలలు…. ట్రిపుల్ ఐటీతో సాకారం.. వీసీ వెంకటరమణ

గొప్ప గొప్ప కలలు ట్రిపుల్ ఐటీతోనే సాకారమవుతాయని ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో బుధవారం నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాం కనువిందు చేసింది. ఈ కార్యక్రమం సాక్ భవనంలో నిర్వహించగా, ట్రిపుల్ ఐటీ వీసీ డైరెక్టర్ హాజరయ్యారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులతో, కలశాల అధికారులు మాట్లాడారు. ఈ సందర్భంగా వీ.సి వెంకటరమణ మాట్లాడుతూ… గొప్ప గొప్ప కలలు కన్న తల్లిదండ్రుల కలలు నిజం చేయడానికి ట్రిపుల్ ఐటీలో చేరి విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలన్నారు. నెలలో రెండు సార్లు కళాశాలలో గ్రీవెన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏమైనా సమస్యలుంటే విద్యార్థులు హాస్టల్ భవనాల వద్ద ఏర్పాటు చేసే సలహాల పెట్టెలో సమస్యలపై కంప్లైంట్ చేస్తే కళాశాల అధికారులు సమస్యను వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునివర్సిటీ డైరెక్టర్ సతీష్ కుమార్, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement