Sunday, April 28, 2024

ADB: శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ముందు నిరాహార దీక్ష

శ్రీరాంపూర్, సెప్టెంబర్ 7 (ప్రభ న్యూస్) : 11వ వేజ్ బోర్డు 23నెలల ఏరియర్స్ మొత్తాన్ని ఒకే దఫా చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య నిరాహార దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 11వ వేజ్ బోర్డు 23 నెలల ఎరియర్స్ మొత్తాన్ని ఒకే దఫా కోల్ ఇండియాలో చెల్లించటం జరిగిందని, కోల్ ఇండియా యాజమాన్యం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకే దఫా చెల్లించారని, ప్రతిసారి సింగరేణిలో ఎరియర్స్ మొత్తాన్ని ఒకే దఫా చెల్లించేవారని, కానీ ఈసారి యాజమాన్యం ఏరియర్స్ చెల్లింపులో జాప్యం చేస్తుందని సింగరేణి యాజమాన్యం సంస్థలో డబ్బులు లేవని ఏరియర్స్ చెల్లింపులో జాప్యం చేస్తూ కార్మికులను ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.

యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే తప్పుడు ప్రచారాలు మానేసి ఎరియర్స్ చెల్లింపులు ఒకేసారి చేయాలని డిమాండ్ చేశారు. సంస్థ వేలకోట్ల లాభాల్లో ఉందని ప్రకటించిన యాజమాన్యం నేడు ఏరియర్స్ చెల్లింపుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని, బ్యాంకు అప్పు ఇస్తే ఏరియర్స్ ఇచ్చే ఆలోచనలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 29వేల కోట్ల రూపాయల బకాయిలు ఉందని యాజమాన్యం వాటిని వెంటనే వసూలు చేయకుండా బ్యాంకుల చుట్టూ తిరగవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డ్ ఏరియర్స్, లాభాల వాట చెల్లింపులో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం చిత్తశుద్ధితో కార్మికులకు రావలసిన ఏరియర్స్ మొత్తాన్ని ఒకే దఫా చెల్లించాలని లాభాలవాట 35% చెల్లించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, బ్రాంచ్ సహాయ కార్యదర్శి కొమురయ్య, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, రాజేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, ఫిట్ కార్యదర్శులు ఏరియా కార్యదర్శి మారపల్లి సారయ్య, సంఘం సదానందం, మురళి చౌదరి, దాడి రాజయ్య, ఆకుల లక్ష్మణ్, రవీందర్, గునిగంటి నర్సింగ్ రావు, మోతె లచన్న, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, డి.రవీందర్, ఏఐవైఎఫ్ నాయకులు రవి, సన్నీ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement