Sunday, April 28, 2024

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

చెన్నూర్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ 10వ తరగతి హిందీ పరీక్ష పేపర్ లీకేజీలో హస్తం ఉందని రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. స్థానిక బీజేపీ నాయకులను టౌన్ సీఐ వాసుదేవ్ రావు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బుధ‌వారం వేకవజామున అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో బీజేపీ పెద్దపెల్లి పార్లమెంటు కో కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement