Monday, December 9, 2024

నిరుపేద కుటుంబానికి ఎల్‌ఓసీ..

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్‌ బస్తీకి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నగిశెట్టి నరేష్‌ కుమారుడు ఆదిత్య అనారోగ్యంతో బాధపడుతూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను సంప్రదించగా చికిత్స కోసం ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.3లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించి వారికి అందజేశారు. ప్రస్తుతం చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2లక్షలు, ఇప్పటి వరకు చికిత్స నిమిత్తం రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement