Thursday, April 25, 2024

రజనీకి ఫాల్కే.. సీఎం ఏమన్నారంటే!

తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించడం పట్ల ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌ను ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగానికి రజనీ చేసిన సేవలకు తగ్గ పురస్కారమని సీఎం జగన్ అన్నారు. కర్ణాటకలో జన్మించిన మహారాష్ట్రీయన్, తమిళ సూపర్ స్టార్ శివాజీ రావు గైక్వాడ్.. వెండితెరపై తనదైన ప్రత్యేకమైన స్టైల్‌తో, మేనరిజమ్‌తో అలరించారని సీఎం జగన్ పేర్కొన్నారు.

కాగా, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ సినీ పరిశ్రమలోని గొప్ప నటుల్లో ఒకరైన రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement