Monday, May 6, 2024

డ్రైవర్‌కి చాతిలో నొప్పి.. ఆర్టీసీ బస్సు బోల్తా..

ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. తెలంగాణలోని కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. బ‌స్సు డ్రైవ‌ర్ కి చాతిలో నొప్పి రావ‌డంతో ఒక‌ప‌క్క‌కు ఒరిగాడు. దీంతో స్టీరింగ్ వ‌దిలి బ‌స్సులోంచి కింద‌ప‌డిపోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న లోయ‌లోకి బ‌స్సు దూసుకెళ్లి బోల్తా ప‌డింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్రయాణ సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు, వీరిలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణహాని జరక్కపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement