Saturday, May 18, 2024

కూలిన బ్రిడ్జ్.. రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

గాదిగూడా : గాదిగూడా మండలం లోని లోకారి నుంచి ఉమిరికి వెళ్ళే బుల్లికస, రూమన్ కస సమీపంలో ఉన్న బ్రిడ్జ్ భారీ వర్షానికి కూలి కూలిపోయింది. బ్రిడ్జ్ వైపు ఎవ‌రు వెళ్ల‌వ‌ద్ద‌ని అధికారులు గ్రామ‌స్తుల‌కు సూచించారు. సంబంధిత అధికారులు స్థలాన్ని పరిశీలించి మరమ్మతు చ‌ర్య‌లు చేప్పట్టాల‌ని గ్రామస్తులు కోరుతున్నారు.
రోడ్లు ధ్వంసం..
గాదిగూడా మండలం లోని ధాబా బి గ్రామ పంచాయతీలోని పౌనూర్ లో దిగూడా వెళ్ళే రోడ్డు వర్షానికి అధ్వానంగా మారింది. రోడ్ల‌పైకి వెళ్లాలంటేనే భ‌యం వేస్తోంద‌ని, పూర్తిగా గుంత‌ల‌మ‌యంగా మారాయ‌ని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు. ప్రజా పతినిధులు పరిశీలించి మారుమత్తు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement