Thursday, May 2, 2024

CM First Tour – కెస్లాపూర్‌లో సీఎం రేవంత్ – నాగోబాకు గిరిజ‌న సాంప్రదాయంలో పూజలు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్): సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ ఆదివాసీల ఇలవేల్పు నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇన్‌చార్జి మంత్రి సీతక్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉన్నారు. నాగోబా ఆలయం కమిటీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. మెస్రం వంశీయులు, మహిళా సంఘాలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.

13 కోట్ల‌తో ర‌హ‌దారి నిర్మాణానికి శ్రీ‌కారం..
ముట్నూ ర్ నుండి కేశ్లాపూర్ కు 13 కోట్లతో రహదారి పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ఆదివాసీల సంస్కృతి గొప్పదని వారి సంస్కృతి సాంప్రదాయాలు పరీర క్షిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్ షో ద్వారా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి నివాళులర్పించారు. తెలంగాణ పునర్నర్మాణ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇంద్రవెల్లి ఆదివాసి అమరవీరుల కుటుంబాలను కలుసుకొని వారికి పరిహారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement