Monday, April 29, 2024

సిసి రోడ్డు నిర్మాణ పనులు..

కాసిపేట : మండలం ముత్యంపెల్లి గ్రామంలో నూతనంగా చేపట్టే సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులను నాయకులు
ప్రారంభించారు. గ్రామంలోని ఒకటవ వార్డులో ఎఫ్‌ఎఫ్‌ నిదులు రెండు లక్షలతో చేపట్టే రోడ్డు నిర్మాణంతో ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆడే బాదు, వైస్‌ ఎంపిపి విక్రంరావు, ఉప సర్పంచ్‌ తిరుపతి టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు మోటూరి వేణు, కో ఆప్షన్‌ సభ్యుడుసిరాజ్‌ఖాన్‌,వార్డు సభ్యులు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement