Sunday, April 28, 2024

TS : ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజంటూ ఫేక్​ న్యూస్​…ముగ్గురిపై కేసు నమోదు

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్) : అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ అలం గురువారం ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. ఎస్ఎస్సి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న వదంతుల మేరకు ఆదిలాబాద్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రాన్ని సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.

- Advertisement -

ప్రశ్నాపత్రాలు, విద్యార్థుల హాజరు, ఇన్విజిలేటర్ల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఎస్పీ వెంట ఎంఈఓ జయశీల అధికారులు ఉన్నారు.
సరిహద్దు చెక్ పోస్టుల తనిఖీ
లోక్ సభ ఎన్నికల ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని జైనథ్ , పిప్పర్ వాడ తనిఖీ కేంద్రాలను కలెక్టర్ ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు. నిరంతరం నిఘా పేంచాలని ఆదేశించారు.
ఫేక్ న్యూస్ పై ఎస్పీ సీరియస్..
ఎస్ఎస్సి పరీక్షల్లో ముందస్తుగా పేపర్ లిక్ అవుతుందని, కాపీయింగ్ జరుగుతుందని పుట్లూరులో వచ్చిన వదంతులపై ఎస్పీ విచారణ జరిపించారు. వ్యక్తిగత కక్షలతో ప్రిన్సిపాల్ వరప్రసాద్ పై వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేల ముగ్గురు వ్యక్తులు ఫేక్ న్యూస్ ద్వారా సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయించారని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు నిందితులు పి ఈ టి మమ్మద్ ముబాసి ర్, మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ కైఫ్ లపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీ కి సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement