Friday, May 3, 2024

TS : ఎమ్మెల్సీ అరెస్టుకు నిరసనగా బీఆర్​ఎస్​ నేతల రాస్తారోకో

జైనూర్, మార్చి 16(ప్రభ న్యూస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇది అధికారులు అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఆదేశాల మేరకు జైలుర్ మండల కేంద్రంలోని కొమరం భీం చౌరస్తా ప్రధాన రోడ్డుపై జైనువూరు సిర్పూర్ లింగాపూర్ మండలాలకు చెందిన టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో కొమరం భీం జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు సిర్పూర్ (యు) జడ్పిటిసి కోవా అరుణ సిర్పూర్ యు లింగాపూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజులాల, ఆత్రం అనిల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో నష్టం కలిగించడానికి వీడి అధికారులతో అక్రమంగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు చేయించి అక్రమ అరెస్టు చేశారని సుప్రీంకోర్టు ఆదేశాలను ఈడీ అధికారులు ధిక్కరించారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement