Thursday, May 2, 2024

రెండున్నర‌ కిలోల నువ్వుల నూనె తాగి దైవభక్తిని చాటుకున్న ఆదివాసీ మహిళ

ఆదిలాబాద్ : దైవభక్తి, పాపభీతి మెండుగా ఉండే ఆదివాసులు తమ ఇష్ట దైవాలను ఎంతో నిష్ఠతో కోలుసుకొంటారు. తమ సంస్కృతి సంప్రదాయాలను కంటికి రెప్పల్లా కాపాడుకొంటున్నారు. పాచ్యాత్య సంస్కృతి నీలి నీడలు అడవి ఒడిలోకి అడుగుపెట్టినా ఆదివాసీ సంస్కృతి కల్తీ లేకుండా సాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న గోండుల్లోని తొడసం తెగ ఆరాధ్య దైవం ఖందేవునికి సోమవారం రాత్రి తొడసం వంశీయులు పూజలు చేసి జాతరను ప్రారంభించారు. మంగళవారం విశ్వశాంతిని కోరుకొంటూ ఆదివాసీ మహిళ రెండున్నర‌ కిలోల నువ్వుల నూనెను తాగి మొక్కు తీర్చుకోంది. నార్నూర్ మండలంలోని చిత్తగూడకు చెందిన మడావి ఎత్మా బాయ్ తమ వంశస్తుల సమక్షంలో నూనెను తాగి తన దైవభక్తి చాటుకొంది.

తోడసం వంశానికి చెందిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కును తీర్చుకోవడం ఆనవాయితీ. తోడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకువచ్చిన నువ్వుల నూనె సేకరిస్తారు. ఆ నూనెను తొడసం ఆడపడుచు తాగి మొక్కులు తీర్చుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement