Sunday, May 5, 2024

భారీ వర్షాలకు కూలిన ఇల్లు

జైనూర్ జులై 23( ప్రభన్యూస్) గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డే సార పంచాయతీలోని వడ్డర్ గూడ గ్రామానికి చెందిన జాదవ్ వెంకటి ఇల్లు కూలిపోయిందని జాదవ్ వెంకటి దంపతులు తెలిపారు. భారీ వర్షాల వల్ల ఇల్లు కూలి చాలా నష్టపోయానని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వపరంగా నిరుపేద వృద్ధ దంపతులకు సహాయం అందించాలని వారు కోరారు. కూలిన ఇంటి వివరాలను స్థానిక తహసిల్దార్ కు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు కారోబార్ మచ్చిందర్ తెలిపారు. భారీ వర్షాలతో ఇల్లు పూర్తిగా కూలిపోయినిరాశ్యులయ్యారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement