Friday, May 17, 2024

ఫ్యాన్‌హౌస్‌ పనులు ప్రారంభం

కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట 2వ గనిపై నూతనంగా చేపట్టనున్న ఫ్యాన్‌హౌస్‌ నిర్మాణానికి జీఎం చింతల శ్రీనివాస్‌ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాన్‌ హౌస్‌ నిర్మాణంతో గనిలో స్వచ్చమైన గాలి కార్మికులకు అందుతుందని, దాంతో కార్మికులు స్వేచ్చగా విధులు నిర్వహిస్తూ బొగ్గు ఉత్పత్తికి తోడ్పడుతారని ఆయన పేర్కొన్నారు. జీఎం వెంట గని మేనేజర్‌ రవీంధర్‌, కాసిపేట గనుల గ్రూప్‌ ఏజెంట్‌ రాజేందర్‌, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement