Wednesday, May 1, 2024

సిద్దిపేట‌లో ‘ఫ్రైడే .. డ్రైడే’.. పాల్గొన్న అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ గరిమా అగ్రవాల్

సిద్ధిపేట ప్రతినిధి – ఆరుబయట చెత్తను తొలగిద్దాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణ 3 వ వార్డులో జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగ్రవాల్ ,మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్,స్థానిక వార్డు కౌన్సిలర్ వంగ రేణుక-తిరుమల్ రెడ్డి తో కలిసి ప‌ర్య‌టించారు.. ప్రజలకు చెత్త పట్ల అవగాహన కల్పించారు.. అలాగే హైదరాబాద్ రోడ్డులో గల ఆదర్శ్ నగర్, మహాశక్తి నగర్ లలో కలియతి రిగుతూ ఓపెన్ ప్లాట్ లలో ,మురుగు నీటి కాలువలలో ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్,చెత్తను తొలగిస్తూ అందరికి అవగాహన కల్పించారు.

ఈ సంద‌ర్భంగా అడిషనల్ కలెక్టర్ గరిమా మాట్లాడుతూ, – మంత్రి హరీశ్ రావు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలోని ప్రజలు ఆరుబయట చెత్త వేయడం తగ్గుతుందని అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రజలు చెత్తను మూడు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయడం గొప్ప సంకల్పం అని చెప్పారు. సిద్దిపేట పట్టణంలో ఏ కార్యక్రమం తలపెట్టిన విజయం సాధించి మిగితా పట్టణాలకు అదర్శoగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా అన్ని పట్టణాలు స్ఫూర్తిగా తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అడిషనల్ కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. .పట్టణ పాలకవర్గం సభ్యులు, అధికారుల పనితీరు పట్ల అడిషనల్ కలెక్టర్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు మాట్లాడుతూ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు సిద్దిపేట పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన గొప్ప కార్యక్రమం నడుస్తూ చెత్తను తొలగిద్దాం కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరుబయట చెత్త వేసే ప్రజలలో ఇప్పటికైనా చైతన్యం రావాలని సూచించారు. తల్లిదండ్రులు వారి వారి పిల్లలకు కూడా చిన్నతనం నుంచే మంచి అలవాట్లను నేర్పించాలని సూచించారు

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, పట్టణ కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు,మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement