Thursday, May 2, 2024

కామినేని ఆస్ప‌త్రిలో నటి దీపిక ప‌దుకొనేకు.. ప్రాథ‌మిక చికిత్స‌

ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్ లో ఉంటున్న‌ బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే ఈరోజు హైద‌రాబాద్‌లోని కామినేని ఆసుప‌త్రిలో చేరారు. ఈరోజు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి హార్ట్ బీట్ పెరిగిపోయింద‌ని కంగారుప‌డ్డ దీపిక ప‌దుకొనే షూటింగ్ ర‌ద్దు చేసుకుని హుటాహుటీన కామినేని ఆసుపత్రికి వ‌చ్చారు. కామినేని ఆసుప‌త్రిలో ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం ఆమె తాను బ‌స చేసిన నోవాటెల్ హోట‌ల్‌కు వెళ్లిపోయారు. నోవాటెల్‌లోనూ ఆమె వైద్యుల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం దీపిక ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని ఆమెకు వైద్యులు సూచించిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement