Friday, April 26, 2024

బీజేపీకి రాజీనామా చేసిన నటుడు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయనున్న సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. మా ఎన్నికల బరిలో ఉన్న నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే, సరైన సందర్భంలో రాజీనామాకు గల కారణాలు చెబుతానని సీవీఎల్ తెలిపారు.

కాగా, టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల కారణంగా వాతావరణం వేడెక్కింది. ప్రకాష్ రాజ్, సీవీఎల్‌ నరసింహారావు సహా మొత్తం ఐదుగురు మా అధ్యక్ష బరిలో ఉన్నారు. ‘మా’లో ఇకపై తెలంగాణ, ఆంధ్రా అని రెండు విభాగాలు ఉండాలంటూ ఇటీవల నటుడు సీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నటి విజయశాంతి మద్దతు తెలిపారు. ఆయన వాదనలో నిజముందని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: టీ.టీడీపీకి ఎల్‌.రమణ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement