Sunday, April 28, 2024

HYD | ఏసీపీ ఇంట వివాహ మహోత్సవం.. హాజరైన మాజీ మంత్రి జానారెడ్డి

హైదరాబాద్​లోని​ వనస్థలిపురంలో జీఎస్ఆర్ కన్వెన్షన్​లో ఎల్​బీనగర్​ ఏసీపీ ఎస్​. జానకిరెడ్డి కుమారుడి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. గురువారం జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏసీపీ జానకిరెడ్డి తమ ప్రాంత వాసి కావడంతో వివాహ వేడుకకు విచ్చేసిన బంధు మిత్రులందరినీ పెరుపేరునా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement