Saturday, May 18, 2024

Breaking: నాంపల్లి ఎగ్జిబిషన్ లో ప్రమాదం.. కెన‌డా నుంచి వ‌చ్చిన బాలిక‌కు గాయాలు

హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో జ‌రుగుతున్న ఎగ్జిబిష‌న్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. వినోద ఆట (సునామి) ఆడుతూ ప్రమాదవశాత్తు ఓ 12 ఏళ్ల బాలిక జారిప‌డింది. ఆ బాలిక పేరు సయ్యద్ మదిహగా స్థానికులు తెలిపారు. ఇటీవల కెనడా నుండి వచ్చిన ఆ బాలిక కుటుంబం నాంపల్లి రెడ్ హిల్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న‌ట్టు స‌మాచారం. గాయపడిన బాలికను కుటుంబ సభ్యులు నాంపల్లి కేర్ హాస్పిటల్ కు తరలించారు. కాగా ప్ర‌స్తుతం ఆ అమ్మాయి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్ట‌ర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement