Tuesday, April 30, 2024

‘ది వారియర్’ నుంచి ఆది ఫ‌స్ట్ లుక్.. విల‌న్ గెటప్​లో అదుర్స్..

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న సినిమా ‘ది వారియర్.. ఇందులో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నసంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్నఈ మూవీలో రామ్ పోలీస్ గా వ్యవహరించనున్నారు. ఆయన సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

కాగా, సినిమాలో గురు పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నట్టు తెలుస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్​ విడుదల చేశారు చిత్ర బృందం. సరైనోడు తర్వాత ఆది పినిశెట్టి చేస్తున్న ఫుల్ ఫ్లెడ్జెడ్ విలన్ రోల్ ఇదేనని చెప్పాలి. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement