Tuesday, May 21, 2024

ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అభిలాష అభినవ్

ఖమ్మం కలెక్టరేట్, జూలై 19: ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టరుగా అభిలాష అభినవ్ బుధవారం ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న‌ అభిలాష అభినవ్ ని ప్రభుత్వం ఇటీవల ఖమ్మం జిల్లాకు అద‌న‌పు క‌లెక్ట‌ర్ గా బదిలీ చేసింది. అదనపు కలెక్టర్ స్వస్థలం బీహార్ రాష్ట్రం పాట్నా కాగా, 2017 సివిల్ సర్వీస్ పరీక్షల్లో 18 ర్యాంక్ సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement