Saturday, April 27, 2024

KNR: కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం..

కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. పురపాటి సంపత్ భార్య పురపాటి గీత తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తో పెట్రోల్ మీద పోసుకొని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. బ్లూ కోర్ట్ పోలీసులు అడ్డుకొని పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు.

తన భర్త సంపత్ పై ఎంపీపీ వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నామని తెలిపారు. కరీంనగర్ విజేత ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న తమకు న్యాయం చేయాలని మహిళ నిరసన వ్యక్తం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement