Thursday, May 2, 2024

Breaking: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్​.. ఒకరు మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో బైకిస్టు చనిపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో ఇవ్వాల (శనివారం) రాత్రి కొద్ది సేపటి క్రితం జరిగింది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అప్పన్నపేట ఫ్లైఓవర్ సమీపంలో టీస్ 08 యూఎఫ్ 9657 అనే నెంబర్ కల లారీ.. రోడ్డు పక్కన పార్కింగ్ లైట్లు వేయకుండా నిలిపి ఉంచగా, వెనక నుండి ఏపీ 15 ఏవి 3218 అనే నంబర్ గల ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బసంత్ నగర్ ఎస్ఐ మహేందర్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహన నంబర్ ఆధారంగా మృతుడు సుల్తానాబాద్ స్వప్న కాలనీకి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement