Monday, May 6, 2024

TS : బిఆర్ఎస్ కు 90 సీట్లు పక్క…బోయినపల్లి వినోద్

తెలంగాణ లో మూడో సారి అధికారంలోకి రాబోతున్నామని 90 సీట్లు పక్క అని ప్రణాళిక సంఘం ఉపాఢ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కె సి ఆర్ ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసారని ప్రజలనుండి మంచి స్పందన వచ్చిందన్నారు.

కాంగ్రెస్ వారు వాషింగ్ పౌడర్ నిర్మా టైప్ లో గెలుస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, ప్రజలుమార్పు కోరుకోవడం లేదని అన్నారు. ఎన్నుకల తరువాత కాంగ్రెస్. మొలకెత్తదని అన్నారు. కాంగ్రెస్ సి ఎం అభ్యర్థులు చాలా మంది ఓటమి పాలు కాబోతున్నరని అన్నారు. కాంగ్రెస్ ఓటమి తప్పదు, బి జె పి చేతులు ఎత్తివేసిందన్నారు. గాడుపు లేదు ఏమి లేదు బి ఆర్ ఎస్ మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలలో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా రాదని అన్నారు. సమావేశంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జి వి రామకృష్ణ రావు, నాయకులు జక్కుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement