Sunday, April 28, 2024

TS: రూ. 8 కోట్ల డ్ర‌గ్స్ కేసు…కీల‌క నిందితుడు అరెస్ట్ ..

హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాదాపు 8 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ కేసులో మరో కీలక నిందితుడు సౌరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. టీఎస్‌ న్యాబ్ పోలీసులు పుణెలో సౌరవ్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. పంజాగుట్ట పోలీసులు విచారణ తర్వాత కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తీసుకెళ్లారు. మరోవైపు స్టాన్లీని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని కీలక సమాచారాన్ని విచారిస్తున్నారు.

ఇక, వ్యాపార వీసాపై వచ్చిన స్టాన్లీ గోవాలో బట్టల వ్యాపారం చేస్తున్న టైంలో కండోలిమ్ ప్రాంతంలో ఉంటున్న డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్లతో పరిచయం ఏర్పడింది. ఇందులో భాగంగా ఓక్రా సహా మరో ఇద్దరితో కలిసి నిందితుడు చిన్న మొత్తంలో మత్తు పదార్థాలు అమ్మకం ప్రారంబించాడు.. కాగా, రెండేళ్ల క్రితం ఓక్రా సహా మరో ఇద్దరు డ్రగ్స్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిపోగా.. దీంతో స్టాన్లీకి విదేశాల నుంచి డ్రగ్స్ వచ్చే మార్గం క్లోజ్ అయింది.

- Advertisement -

అయితే, గోవా జైలు నుంచే ఓక్రా డ్రగ్స్‌ బిజినెస్ కొనసాగించాడు. ఇందులో ఓక్రాకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరభ్ సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నైజీరియా నుంచి డ్రగ్స్ తెప్పించి సౌరభ్‌కు ఓక్రా ఇచ్చేవాడు.. ఓక్రా ఆదేశాలతో స్టాండ్లీకి సౌరభ్ డ్రగ్స్‌ సరఫరా చేశాడు. అలాగే, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల సమాచారంతో గోవా జైలులో సోదాలు చేయగా.. జైలులో ఉన్న ఓక్రా దగ్గర 16 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓక్రాతో పాటు పలువురు జైలు నుంచే డ్రగ్స్ బిజినెస్ లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement