Monday, May 6, 2024

TS: హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం అసెంబ్లీలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ కేసీఆరే, డిజైనర్ కేసీఆరే, కాంట్రాక్టర్ కేసీఆరే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆరే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని.. హరీష్ రావు మాటలకు విలువ లేదని కొట్టిపారేశారు. హరీష్ రావును కేసీఆర్ కలెక్షన్లకు వాడుకుంటారని.. కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లు చేయడానికే హరీష్ రావు పనికొస్తాడని కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం మీద ఆయనకు అవగాహన లేదని.. ఇలాంటి కలెక్షన్ కింగ్ చెబితే తాము వినాలా ? అని బీఆర్ఎస్ శ్రేణులను ప్రశ్నించారు.

తమ నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లంల-ఉదయసముద్రం ప్రాజెక్ట్ ఉందని చెప్పారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని గుర్తుచేశారు. మరో రూ.200కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాలకు సాగునీరు వస్తాయని వెల్లడించారు. బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక వందసార్లు తాను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. తనతో పాటు తమ మరో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అసెంబ్లీలో దీనిపై ప్రస్తావించారని.. అయినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ప్రాజెక్టుల గురించి, రైతుల గురించి మట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement