Sunday, April 28, 2024

Ind vs Eng : ఇంగ్లండ్ 319కి ఆలౌట్.. 126 పరుగుల లీడ్ లో భారత్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 319 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ జట్టు 126 పరుగుల లీడ్ లో ఉంది.

మూడో రోజు కొనసాగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 445 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు 319 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు బెన్ డక్కెట్ 153 పరుగులు, బెన్ స్టోక్స్ 41 పరుగులు, ఒల్లీ పోప్ 39 పరుగులు, జో రూట్ 18 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు రెండు వికెట్ల చొప్పున తీయగా, బుమ్రా, అశ్విన్ లు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement