Friday, May 10, 2024

తాగునీటి కోసం రూ.93 కోట్లు నిధులు విడుదల -ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి, జూలై 3 (ప్రభ న్యూస్):- అమృత్ 2.0 పథకం ద్వారా 93 కోట్ల రూపాయలను తాగునీటికి నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్ కు తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు 93 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. 35 శాతం కేంద్ర ప్రభుత్వం, 15% మున్సిపల్, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల అయ్యాయని అన్నారు.

జీవో నెంబర్ 312 వాటర్ ట్రీట్మెంట్, కొత్తచెరువుకు 2 కోట్ల 34 లక్షలు, పట్టణంలో నిర్మించిన 9 వాటర్ ట్యాంకుల నిర్మాణాలకు 50 లక్షలు, పైప్ లైన్ 105 కి.మీ ల దూరానికి 40 కోట్ల 50 లక్షల రూపాయలు నిధులు విడుదల చేశామన్నారు. 7,220 నివాస గృహాలకు నీటి పైప్ లైన్ కోసం 10 కోట్ల 13 లక్షలు, ఐదు సంవత్సరాల మెయింటెనెన్స్ కోసం 6 కోట్ల 75 లక్షల రూపాయలు, నీటి ఎద్దడి నివారణకు 20 కోట్ల 44 లక్షలు, మోడ్రన్ దోబీ ఘాట్ నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు, గర్గుల్ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు కోట్ల 90 లక్షలతో హై లెవెల్ బ్రిడ్జికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. మూడు కోట్ల రూపాయలతో మోడ్రన్ వైకుంఠధామ నిర్మాణం, 25 లక్షల రూపాయలతో 6వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణo పనులు చేపట్టామన్నారు.

సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేశారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement