Saturday, May 4, 2024

TS: ఉపాధి కూలీలపై తేనెటీగల బీభత్సం… 42 మందికి గాయాలు…

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్): ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేసిన ఘటనలో 42 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… అదిలాబాద్ జిల్లా బేల మండలం దౌను గూడా గ్రామపంచాయతీ పరిధిలోని రేణిగుడ గ్రామ సమీపంలో గురువారం ఉదయం 60మంది కూలీలు పలుగు పార, చేతబట్టి, మట్టి తవ్వకo పనుల్లో నిమగ్నమయ్యారు. అక్కడే చెట్ల పొదల్లో తేనె తుట్టి నుండి తేనెటీగలు లేచి ఉపాధి హామీ కూలీలపై బీభత్సం సృష్టించాయి.

తేనెటీగలు దాడి చేయడంతో బీతిల్లిన కూలీలు ఉరుకులు పరుగులతో తమ గ్రామం వైపు పరుగు తీశారు. తేనెటీగల దాడిలో తలకు, మెడకు, ముక్కు, చెవులకు గాయాలయ్యాయి. తేనెటీగలు కుట్టగా కొందరికి రక్తపు గాయాలయ్యాయి. ఘటనలో 42 మందికి పైగా కూలీలకు గాయలయ్యాయి. వీరిలో 15 మంది మహిళలు ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉపాధి హామీ అధికారులను, వైద్య సిబ్బందిని అలర్ట్ చేశారు. వెంటనే జిల్లా కేంద్రం నుండి 5 అంబులెన్స్ లను ఘటనా స్థలానికి పంపి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. రిమ్స్ ఆస్పత్రిలో గాయాల ధాటికి నొప్పి, మంటలతో కూలీలు తల్లడిల్లిపోయారు. రిమ్స్ డైరెక్టర్, డాక్టర్లు వెంటనే చికిత్స అందించారు. వీరి పరిస్థితి అదుపులోనే ఉందని, రెండు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement